ఊపిరితిత్తుల ఆరోగ్యంపై అవగాహన

2చూసినవారు
ధూమపానం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండి ఊపిరితిత్తులను కాపాడుకోవాలని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ సూచించారు. ప్రపంచ సీఓపీడీ దినోత్సవం సందర్భంగా బుధవారం సోమల మండలం ఇరికిపెంట సచివాలయ పరిధిలోని పార్వతీనగర్‌లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఓపీడీ వ్యాధి లక్షణాలు, కారణాలు, నివారణ చర్యలను వివరించారు. దీర్ఘకాలిక దగ్గు, కఫం, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. అనంతరం 64 మందికి ఛాతీ ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించి, న్యూమోనియాపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్