
ఇంటి నుంచి వెళ్లగొడుతున్నారంటూ ఆర్డీవోకు వినతి
కన్న కొడుకులను పెంచి పెద్ద చేసి వివాహాలు చేసినా వృద్ధాప్యంలో దిక్కులేకుండా పోయామని చాపాడు మండలం వీరాజుపాలేనికి చెందిన చిన్నశేషారెడ్డి, జయమ్మ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడో కుమారుడి మరణం తర్వాత కోడలు, మనవడు తమను ఇల్లు ఖాళీ చేయాలంటూ వేధిస్తున్నారని వాపోయారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో గురువారం జమ్మలమడుగు ఆర్డీవోను ఆశ్రయించారు. తహసీల్దార్ ద్వారా న్యాయం చేస్తామని ఆర్డీవో శిరీష హామీ ఇచ్చారు.


























