మాకు న్యాయం చేయండి ఎస్పీ సార్

4265చూసినవారు
మాకు న్యాయం చేయండి ఎస్పీ సార్
వైఎస్సార్‌ కడప జిల్లా మైదుకూరు మండలం వేలంపల్లి గ్రామానికి చెందిన రైతు ఎం. సిద్ధారెడ్డి, తన భూమిని కోగటం వెంకటసుబ్బారెడ్డి ఆన్‌లైన్ చేసుకున్నారని దీనిపై పంచాయతీ జరిగినప్పటికీ న్యాయం జరగలేదని ఆరోపించారు. ఈ క్రమంలో తన పొలం వద్దకు వెళ్తుండగా వెంకటసుబ్బారెడ్డి, అతని కుమారులు తనపై తన భార్యపై, తన అన్నపై చంపాలనే ఉద్దేశ్యంతో దాడి చేశారని బాధితుడు తెలిపారు. గాయాలతో ఊరికి చేరుకున్న తనను స్థానికుల సహాయంతో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సోమవారం జరిగిన ఈ సంఘటనపై, ఎస్పీ సార్ తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని, న్యాయం చేయాలని బాధితుడు వేడుకున్నారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్