పీలేరు - Pileru

పోషకాహారంతోనే ఆరోగ్యం: అంగన్‌వాడీ ఉత్సవాల్లో సూపర్‌వైజర్

పోషకాహారంతోనే ఆరోగ్యం: అంగన్‌వాడీ ఉత్సవాల్లో సూపర్‌వైజర్

అన్నమయ్య జిల్లాలోని మర్రికుంటపల్లి, మేడికుర్తి సచివాలయాల పరిధిలో గల అంగన్‌వాడీ కేంద్రాలలో శనివారం అంగన్‌వాడీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసీడీఎస్ సూపర్‌వైజర్ అరుంధతి హాజరయ్యారు. ఆమె గర్భిణులు, బాలింతలు, తల్లులను ఉద్దేశించి మాట్లాడుతూ, రోజువారీ ఆహారంలో ఐరన్, ప్రోటీన్లు, మినరల్స్, క్యాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉండే సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. తల్లీ, పిల్లల ఆరోగ్యానికి, కుటుంబ ఆరోగ్యం మహిళల చేతుల్లోనే ఉందని, కాబట్టి మహిళలు పోషకాహారంపై అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు.

వీడియోలు


జగిత్యాల జిల్లా
ప్లాస్టిక్ నోట్ల ఎంట్రీపై ఆర్బీఐ కీలక ప్రకటన
Oct 05, 2026, 03:10 IST/

ప్లాస్టిక్ నోట్ల ఎంట్రీపై ఆర్బీఐ కీలక ప్రకటన

Oct 05, 2026, 03:10 IST
దేశంలో ప్లాస్టిక్ నోట్ల చెల్లుబాటుకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.10, రూ.20 విలువైన ప్లాస్టిక్ నోట్ల ఫీల్డ్ ట్రయల్స్ ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ నోట్ల తయారీకి కావాల్సిన మెటీరియల్ సరఫరా కోసం కంపెనీల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. ప్రస్తుతం ఉన్న కాగితపు నోట్లతో పోలిస్తే ఈ ప్లాస్టిక్ నోట్ల మన్నిక ఎక్కువ కాలం ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టును ఆర్‌బీఐ అనుబంధ సంస్థ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ (BRBNMPL) చేపట్టనుంది. 2012లో కూడా ఇలాంటి ప్రయత్నం జరిగినా, సాంకేతిక సమస్యలతో నిలిచిపోయింది. ఇప్పుడు కొత్త టెక్నాలజీలతో మళ్లీ ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు.