ప్రొద్దుటూరులో కొర్రపాడు రోడ్డులోని ఎర్రన్న కొట్టాల వద్ద అదుపుతప్పిన జీపు విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో పెను ప్రమాదం తప్పింది. కారు నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన జీపును వెనుక నుండి వచ్చిన ద్విచక్ర వాహనాలు ఢీకొట్టడంతో వాహనదారులకు స్వల్ప గాయాలయ్యాయి.