ఎస్పీ సార్ నా కొడుకును కాపాడండి

2791చూసినవారు
వైఎస్సార్‌ కడప జిల్లా ప్రొద్దుటూరులోని వాజ్‌పేయి నగర్‌కు చెందిన ఓ మహిళ తన మైనర్‌ కుమారుడిపై కొందరు యువకులు దాడి చేశారని రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రైల్వే స్టేషన్‌ రోడ్డు వద్ద తన కుమారుడిని చితకబాదారని ఆమె ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం కొందరు వ్యక్తులు ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారని, ‘‘స్టేషన్‌ నుంచి బయటికి రా.. నీ కథ చూస్తాం’’ అంటూ హెచ్చరిస్తున్నారని ఆమె తెలిపారు. తమకు, తన కుమారుడికి రక్షణ కల్పించాలని ఎస్పీని మంగళవారం ఆమె వేడుకున్నారు.

సంబంధిత పోస్ట్