
రైల్వేకోడూరులో ఘనంగా సీతారామ విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు
అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలంలోని సింగిరివారిపల్లిలో శనివారం శ్రీ సీతారామ, లక్ష్మణ, హనుమంతుల విగ్రహ ప్రతిష్ఠాపన మరియు సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. గ్రామస్తుల ఆహ్వానం మేరకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామిరెడ్డి ధ్వజారెడ్డి, తోట శివసాయి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మాజీ సర్పంచులు, ప్రముఖులు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు మరియు భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

































