Oct 16, 2026, 06:10 IST/ఆర్మూర్
ఆర్మూర్
కాలనీ సమస్యల పరిష్కారణలో కృషి చేస్తున్న నందిపేట్ సర్పంచ్
Oct 16, 2026, 06:10 IST
నందిపేట్ గ్రామపంచాయతీ పరిధిలోని 16వ వార్డులో ఉదయం 6 గంటలకు సర్పంచ్ ఎర్రం లింగం మార్నింగ్ వాక్లో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులో నెలకొన్న సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో గ్రామపంచాయతీ కార్యదర్శి మహేందర్, వార్డు సభ్యుడు నరేష్, కరోబార్లు, గ్రామపంచాయతీ వాటర్మ్యాన్ రఫీక్ మహబూబ్తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునే దిశగా వివరాలు సేకరించారు.