రాయచోటి - Rayachoti

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వన్యప్రాణుల సంరక్షణ వారోత్సవ ముగింపు

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వన్యప్రాణుల సంరక్షణ వారోత్సవ ముగింపు

అన్నమయ్య జిల్లా, రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జంతుశాస్త్ర విభాగం, NSS ఆధ్వర్యంలో వన్యప్రాణుల సంరక్షణ వారోత్సవాల ముగింపు కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా అటవీ శాఖ సెక్షనల్ అధికారి జి. భరణి కుమార్ మాట్లాడుతూ మొక్కలు నాటడం, అడవులను కాపాడటం, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విద్యార్థులకు సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. శ్రీనివాసరావు పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను, జంతుశాస్త్ర విభాగం డాక్టర్ ఎం. మునియా నాయక్ అడవుల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

వీడియోలు


ఉమ్మడి వరంగల్ జిల్లా