
కొటాల జనసేన ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వెంకటసుబ్బమ్మ
తంబళ్లపల్లి మండలం కొటాల జనసేన పార్టీ కూటమి ఎంపీటీసీ అభ్యర్థిగా జనసేన పార్టీ సీనియర్ నాయకుడు ఎద్దుల నరసింహులు తల్లి ఎద్దుల వెంకటసుబ్బమ్మ నామినేషన్ దాఖలు చేశారు. కొటాల ఎంపీటీసీ అభ్యర్థిగా తన నామినేషన్ పత్రాలను గురువారం తంబళ్లపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల అధికారి శ్రీధర్ కు అందజేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో పోతంశెట్టి చంద్రమోహన్, మహేశ్వర్, నరేందర్ నాయుడు, బండి మురళి, జనసేన, తెలుగుదేశం, బిజెపి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






























