AP: రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రాజధాని విస్తరణ, మౌలిక వసతుల కల్పన కోసం నిర్వహిస్తున్న రెండో విడత భూసమీకరణ ప్రక్రియకు భూములిచ్చేందుకు రాజధాని ప్రాంత రైతులు ముందుకొస్తున్నారు. ఇందులో భాగంగా వైకుంఠపురం గ్రామ పరిధిలోని మాదల కుటుంబం తమకు చెందిన 14.36 ఎకరాల భూమిని అమరావతి నిర్మాణం కోసం సీఆర్డీఏకు అందజేసేందుకు అంగీకరించింది.