మరో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు

9చూసినవారు
మరో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు
AP: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం సాయంత్రం నాటికి ఉత్తర అండమాన్ ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని APSDMA తెలిపింది. ఆ తదుపరి 3-4 రోజుల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశం ఉందని పేర్కొంది. వచ్చే వారం రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కాసేపట్లో విజయనగరం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, విశాఖ జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, గంటకు 40-60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే  అవకాశం ఉందని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్