AP: ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. వైఎస్సార్సీపీ ఒక కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలను గెలుచుకోగా, తాజాగా మరో మున్సిపాలిటీలో వైస్ ఛైర్మన్ పదవిని దక్కించుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా నంద్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ పదవిని కూటమి దక్కించుకున్నప్పటికీ, వార్డుల్లో వైఎస్సార్సీపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. దీంతో నంద్యాల మున్సిపాలిటీలో వైస్ ఛైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశంపై ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది.