కూట‌మిలో మ‌రో చిచ్చు!

2920చూసినవారు
కూట‌మిలో మ‌రో చిచ్చు!
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు అయింది. మూడు పార్టీల కూటమిలో కొత్త సమస్యలు మొదలవుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో కూటమి పార్టీల నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. జగన్ సొంత జిల్లాలో ఇప్పుడు కూటమి పార్టీ నేతల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్- జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య రచ్చ ఇప్పుడు జిల్లాలో కూటమికి సమస్యగా మారుతోంది. దీనిపై బీజేపీ అధిష్ఠానం సైతం ఆగ్ర‌హంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్