ముంచుకొస్తున్న మరో తుఫాన్.. ఏపీలో భారీ వర్షాలు!

6చూసినవారు
ముంచుకొస్తున్న మరో తుఫాన్.. ఏపీలో భారీ వర్షాలు!
ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాన్‌ ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా, సోమవారం తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అదే రోజు సాయంత్రానికి తుఫాన్‌గా మారవచ్చని అంచనా వేసింది. బుధవారానికి తీవ్ర తుఫాన్‌గా మారి ఉత్తర కోస్తాంధ్ర సమీపంలో తీరం దాటే అవకాశముందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్