మళ్లీ తుఫాన్.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

42చూసినవారు
మళ్లీ తుఫాన్.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
AP: రాష్ట్రానికి మరో తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తదుపరి 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా, ఆ తర్వాత తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. సోమవారం సాయంత్రానికి ఇది ఏపీ తీరానికి చేరుకునే అవకాశం ఉంది. రానున్న 3 రోజుల్లో సెంట్రల్ ఆంధ్రా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని, రేపు సాయంత్రం నుంచి తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో గాలులు వీస్తాయంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్