ఏపీకి మరో తుఫాన్ ముప్పు!

5074చూసినవారు
ఏపీకి మరో తుఫాన్ ముప్పు!
అర్నబ్, మురసు తుపానుల ధాటికి ఇప్పటికే భారీగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌పై మరో తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈనెల 15వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి తుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తుపాను ప్రభావం ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలతో పాటు తమిళనాడు తీర ప్రాంతాలపై పడవచ్చని వాతావరణ శాఖ నివేదిక పేర్కొంది. అప్రమత్తంగా ఉండాలని తీర ప్రాంత ప్రజలకు సూచనలు జారీ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్