ఏపీకి మరో వందే భారత్ స్లీపర్

0చూసినవారు
ఏపీకి మరో వందే భారత్ స్లీపర్
నవంబర్ 1వ తేదీన బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం కానుండగా, ఇది ఏపీలోని గుంతకల్, అనంతపురం మీదుగా ప్రయాణించనుంది. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశమయ్యారు. విశాఖపట్నం-తిరుపతి మీదుగా బెంగళూరుకు వందే భారత్ స్లీపర్ రైలును, అలాగే విశాఖ-తిరుపతి మధ్య పగటిపూట ప్రత్యేక రైలును నడపాలని ఆయన కోరారు. కనిగిరి-విజయవాడ రైల్వే లైన్ సేవలపై కూడా చర్చించారు. ఈ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్