ఏపీలో 2027 మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదలైంది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నవంబరు 11 నుంచి 25 వరకు ఫీజు చెల్లించవచ్చు. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబరు 2 వరకు, రూ.200తో డిసెంబరు 9 వరకు, రూ.500తో డిసెంబరు 15 వరకు అవకాశం కల్పించారు. అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.125, మూడు సబ్జెక్టులకు రూ.110 చెల్లించాలి. ఒకేషనల్
విద్యార్థులు అదనంగా రూ.60 కట్టాలి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు యూడైస్ ప్లస్‌లో వివరాలను పరిశీలించి, స్కూల్ లాగిన్ ద్వారా ఫీజు పే చేస్తారు.