AP: దసరాకు 5,261 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..!

41చూసినవారు
AP: దసరాకు 5,261 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..!
AP: దసరా పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్‌ఆర్టీసీ 5,261 ప్రత్యేక బస్సులను నడపనుంది. పండుగకు ముందు, తర్వాత రోజుల్లో సొంతూళ్లకు వెళ్లేవారి కోసం ఈ నెల 16 నుంచి 19 వరకు 3,207 బస్సులు, తిరిగి వచ్చే వారి కోసం 20 నుంచి 25 వరకు 2,054 బస్సులు నడపనున్నారు. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలనే వసూలు చేయనున్నారు. దసరా ఉత్సవాలు ఈ నెల 11న ప్రారంభమై 20న విజయదశమితో ముగుస్తాయి.

సంబంధిత పోస్ట్