AP: రాష్ట్ర ప్రభుత్వం
ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని పునఃప్రారంభించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులు, నవజాత శిశువుల కోసం ఈ పథకం కింద 14 రకాల అత్యవసర వస్తువులతో కూడిన కిట్లను ఉచితంగా అందిస్తారు. దోమతెరతో కూడిన బేబీ బెడ్, దుస్తులు, షాంపూ, ఆయిల్, సబ్బు వంటివి ఈ కిట్లో ఉంటాయి. శిశు మరణాల రేటును తగ్గించడం, నిరుపేద కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడం ఈ పథకం లక్ష్యం. ఏటా 51.15 కోట్ల బడ్జెట్తో సుమారు 2.45 లక్షల మంది శిశువులకు ఈ కిట్లను అందించనున్నారు.