ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి (సోమవారం) ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 గంటలకు ఉభయసభలు సమావేశం కానుండగా, సుమారు నాలుగు రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ప్రశ్నోత్తరాల సమయం అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం కానుంది. మొత్తం పది అంశాలు సభలో చర్చకు రానున్నాయి. డీఎస్సీ-2025పై వాస్తవాలను మంత్రి నారా
లోకేశ్ సభలో వెల్లడించనున్నారు. మరోవైపు ప్రతిపక్ష హోదా కల్పించకపోతే అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాబోమని
వైసీపీ స్పష్టం చేసింది.