డిసెంబర్ 5 నుండి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

1చూసినవారు
డిసెంబర్ 5 నుండి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 5 నుంచి సుమారు 15 రోజుల పాటు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ సమావేశాల్లో పెట్టుబడుల రక్షణ చట్టం బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం, దీని ద్వారా పారిశ్రామిక సంస్థలకు భరోసా కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి సంక్షేమ పథకాల అమలు, రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్