30 అజెండా అంశాలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం

15చూసినవారు
30 అజెండా అంశాలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం
ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించే దిశగా మొత్తం 30 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యంగా సీఐఐ (CII) సదస్సులో భాగంగా ఒప్పందాలు చేసుకున్న 6 ప్రముఖ సంస్థల పెట్టుబడి ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. ఈ ఆరు సంస్థల ద్వారా సుమారు రూ. 36 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి, దీనివల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ కీలక నిర్ణయాలతో పాటు మరికొన్ని పరిపాలనాపరమైన ప్రతిపాదనలకు కూడా మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్