పలు కీలక అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం

33చూసినవారు
పలు కీలక అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన భేటీలో పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా నాలుగు పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. రాజమహేంద్రవరం, తిరుపతి, గుంటూరు, కర్నూలు కేంద్రాలుగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. అమరావతి పరిధిలోని గ్రామాల్లో రూ.1,548 కోట్లతో మౌలిక వసతుల పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతి ఇన్‌ఫ్రా పనులకు అదనంగా రూ.644.98 కోట్లు, అసెంబ్లీ మరమ్మతులకు రూ.661 కోట్లు కేటాయించనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్