AP: అమరావతిలో రేపు (శుక్రవారం) ఏపీ కేబినెట్ అత్యవసరంగా సమావేశం కానుంది. స్థానిక సంస్థల
ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై మంత్రివర్గం కీలకంగా చర్చించనుంది. సుప్రీంకోర్టు నిర్ణయం నేపథ్యంలో రిజర్వేషన్ల ఖరారు, తదుపరి కార్యాచరణపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే మార్గాలపైనా ప్రభుత్వం సమాలోచనలు చేయనుంది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉండటంతో ఉత్కంఠ నెలకొంది.