నేడు ఏపీ కేబినెట్ సమావేశం

4చూసినవారు
నేడు ఏపీ కేబినెట్ సమావేశం
AP: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం ఉదయం 10:30 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కీలక భేటీలో పలు ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా ఎస్ఐపీబీ (SIPB) ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే, విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుపై మంత్రివర్గం దృష్టి సారించనుంది. పెట్టుబడుల ఆకర్షణ మరియు వివిధ శాఖల మధ్య సమన్వయం పెంచుకోవడంపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్