కాసేపట్లో ఏపీ కేబినెట్ వర్చువల్ సమావేశం

12చూసినవారు
కాసేపట్లో ఏపీ కేబినెట్ వర్చువల్ సమావేశం
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం వర్చువల్ విధానంలో సమావేశం కానుంది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎస్ సాయి ప్రసాద్, మంత్రులు పాల్గొంటారు. అర్నాబ్ తుఫాన్ వల్ల జరిగిన నష్టం, మౌలిక వసతుల పునరుద్ధరణపై కేబినెట్ చర్చించనుంది. సుమారు రూ.35 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు, తద్వారా 23,634 మందికి ఉపాధి కల్పించే ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్నారు. రాయలసీమలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో పాటు సెమీ కండక్టర్ యూనిట్లు, పారిశ్రామిక ఒప్పందాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

సంబంధిత పోస్ట్