AP: ప్రభుత్వం నివాస ధ్రువీకరణ పత్రాల జారీ విధానంలో కీలక మార్పులు చేసింది. గతంలో ఆధార్, రేషన్ కార్డులను నివాస రుజువులుగా ఉపయోగించాలన్న జీవోను రద్దు చేస్తూ, తాజాగా తహసీల్దార్ కార్యాలయాల ద్వారానే రెసిడెన్స్ సర్టిఫికెట్ పొందాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2015 జూన్ 20న జారీ చేసిన జీవోను రద్దు చేసి, పాత విధానాన్ని పునరుద్ధరించారు. విద్య,
ఉద్యోగాలు, ఓటరు జాబితాలో పేరు నమోదుకు స్థానిక గుర్తింపు అవసరం కావడంతో ప్రజల విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.