AP: ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల

602చూసినవారు
AP: ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల
AP: రాష్ట్ర ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.1200 కోట్లను ఎట్టకేలకు విడుదల చేసింది. నిధుల విడుదలలో వడ్డీ మినహాయింపు అంశంపై నెలకొన్న వివాదం కారణంగా ఆలస్యమైంది. ప్రభుత్వం రుణాలు తీసుకొచ్చి నిధులు విడుదల చేస్తున్నందున, కాలేజీలు 7.5 శాతం వడ్డీ చెల్లించాలని అధికారులు ప్రతిపాదించారు. అయితే, కాలేజీ యాజమాన్యాలు దీనికి అంగీకరించలేదు. చివరికి, ఎలాంటి కోతల్లేకుండా నిధులు విడుదల చేయడంతో ఈ సమస్యకు తెరపడింది.

సంబంధిత పోస్ట్