శాప్ ముట్టడిపై ఏపీ సర్కార్ సీరియస్!

19చూసినవారు
శాప్ ముట్టడిపై ఏపీ సర్కార్ సీరియస్!
ఏపీలో డీఎస్సీ అక్రమాలను నిరసిస్తూ YCP నాయకులు విజయవాడలోని శాప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. ఈ ఘటనలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువులను వైన్ షాపులకు కాపలా పెట్టిన జగన్, ఉపాధ్యాయులను గౌరవిస్తారని అనుకోవడం భ్రమ అని లోకేష్ ట్వీట్ చేశారు. క్రీడాకారులపై అవకతవకలంటూ ఫేక్ ఆరోపణలు చేసినప్పుడే జగన్ దుర్బుద్ధి బయటపడిందన్నారు. స్పోర్ట్స్ కోటా టీచర్లు న్యాయం చేయాలని కోరుతూ శాప్ కార్యాలయం వద్ద అధికారులను కలిశారన్నారు. క్రీడలతో దేశానికి పేరు తెచ్చిన స్పోర్ట్స్ కోటా టీచర్లపై వైసీపీ ఫ్యాక్షన్ ముఠా దాడికి దిగిందని లోకేష్ ఆరోపించారు.

సంబంధిత పోస్ట్