AP: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు ఇప్పటికే పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో, ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు టెలీ కాన్ఫెరెన్స్ నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టుల వద్ద నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షించాలని, క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.