ఏపీ గవర్నర్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం

125చూసినవారు
ఏపీ గవర్నర్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం
AP: రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కాన్వాయ్‌కు ప్రమాదం తప్పింది. మచిలీపట్నంలో మంగళవారం 63 అడుగుల వినాయకుడిని గవర్నర్ అబ్దుల్ నజీర్ దర్శించుకుని తిరిగి వస్తున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి వద్ద గవర్నర్ కాన్వాయ్‌కు గుర్తు తెలియని వ్యక్తి అడ్డుగా వచ్చాడు. భద్రతా సిబ్బంది అప్రమత్తం అవ్వడంతో ఈ ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్