తుఫాన్‌పై ఏపీ వైద్యారోగ్యశాఖ అప్రమత్తం

14చూసినవారు
తుఫాన్‌పై ఏపీ వైద్యారోగ్యశాఖ అప్రమత్తం
AP: తుఫాను ముప్పు నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలోని 15 తుఫాను ప్రభావిత జిల్లాల్లో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రసవ గడువు సమీపించిన 3,478 మంది గర్భిణులను గుర్తించి, వారిలో 377 మందిని ఇప్పటికే ఆసుపత్రులకు తరలించారు. ఇందులో 171 మందికి సురక్షితంగా ప్రసవాలు జరిగాయి. అత్యవసర సేవల కోసం 699 వైద్య బృందాలను సిద్ధం చేయడంతో పాటు, 108, 102, 104 వాహనాలను అందుబాటులో ఉంచారు. అలాగే, 88 తీరప్రాంత ఆరోగ్య కేంద్రాల్లోనూ, 955 కేంద్రాల్లో విద్యుత్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్