AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలుచోట్ల రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కడప, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదవ్వగా, మిగతా ప్రాంతాల్లో మోస్తరు వానలు కురుస్తున్నాయి. మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, కృష్ణా,
ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది.