AP: ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 10 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. రూ.1,000 లేట్ ఫీజుతో నవంబర్ 17 వరకు అవకాశం కల్పించింది. ఈ గడువును మరోసారి పొడిగించబోమని స్పష్టం చేసింది. ఈ వివరాలను విద్యార్థులకు తెలిసేలా కళాశాలల నోటీసు బోర్డుల్లో ప్రదర్శించాలని యాజమాన్యాలకు సూచించింది.