అధికారులకు ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ వార్నింగ్

30చూసినవారు
అధికారులకు ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ వార్నింగ్
AP: వైద్య ఆరోగ్య శాఖలో పాలనా వ్యవహారాల్లో జాప్యాన్ని నివారించి, ఫైళ్ల క్లియరెన్స్‌ను వేగవంతం చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. శాఖలోని ఏ స్థాయిలోనైనా ఫైలు పరిశీలన రెండు రోజులకు మించి నిలిచిపోకూడదని, అలాగే ఏ వినతి లేదా అంశంపైనైనా గరిష్ఠంగా 15 రోజుల్లో పూర్తి స్థాయి నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. అనవసర జాప్యానికి కారణమయ్యే అధికారుల నుంచి వివరణ తీసుకోవడంతో పాటు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్