ఏపీ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 ఎంపిక ప్రక్రియ కోసం ప్రభుత్వం ప్రత్యేక జ్యూరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ప్రతిష్టాత్మక కమిటీకి చైర్మన్‌గా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను నియమించారు. సభ్యులుగా అల్లు అరవింద్, ఎస్. గోపాల్ రెడ్డి, ప్రభ వ్యవహరించనున్నారు. అలాగే, ఏపీఎస్‌ఎఫ్‌టీవీ టీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ నియామకాల ద్వారా 2025 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రాలు, కళాకారులను ఎంపిక చేసే ప్రక్రియను కమిటీ చేపట్టనుంది.