AP: రాష్ట్రంలో గురువారం జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 70.02 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎస్ఈసీ తాజాగా ప్రకటించింది. విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 82.51 శాతం ఓటింగ్ నమోదు కాగా, అల్లూరి జిల్లాలో అత్యల్పంగా 62.01 శాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లో అనకాపల్లి 75.58, చిత్తూరు 76.30, కృష్ణా 73.21 శాతం పోలింగ్‌తో పాటు ఇతర జిల్లాల గణాంకాలను అధికారులు వెల్లడించారు. ఈ ఎన్నికల తుది పోలింగ్ శాతాన్ని ఎస్ఈసీ అధికారికంగా నిర్ధారించింది.