నేరాల నియంత్రణకు ఏపీ పోలీసుల 'త్రినేత్ర' యాప్

106చూసినవారు
నేరాల నియంత్రణకు ఏపీ పోలీసుల 'త్రినేత్ర' యాప్
AP: రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కృష్ణా జిల్లాలో విజయవంతంగా పనిచేస్తున్న 'త్రినేత్ర' యాప్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఆదేశించారు. ఈ యాప్ ద్వారా అన్ని జిల్లాల పోలీస్ స్టేషన్లు అనుసంధానం కానున్నాయి. అలాగే ప్రతి జిల్లాలో 20 మంది నిపుణులతో ప్రత్యేక సైబర్ బృందాలను ఏర్పాటు చేసి, డిజిటల్ అరెస్ట్ వంటి మోసాలపై వేగంగా దర్యాప్తు జరపనున్నారు.

సంబంధిత పోస్ట్