AP: రేపటి నుంచి మళ్లీ వర్షాలు

12చూసినవారు
AP: రేపటి నుంచి మళ్లీ వర్షాలు
AP: ఎల్ నినోతో అల్లాడుతున్న ఏపీ ప్రజలకు  వాతావరణ కేంద్రం శుభవార్త చెప్పింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, మరో మూడు రోజుల్లో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో శుక్రవారం నుంచే వర్షాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని, ఇది శనివారం సాయంత్రం నాటికి ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్