ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సమ్మె బాట (వీడియో)

4489చూసినవారు
AP: రెవెన్యూ ఉద్యోగులు సమ్మె బాట చేపట్టారు. అనంతపురం జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్‌కు ఏపీ జేఏసీ అమరావతి నేతలు ఉద్యమ నోటీసు అందజేసింది. పీఆర్సీ కమిషన్ వేయాలని, పెండింగ్ డీఏలు వెంటనే మంజూరు చేయాలని, ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం దిగివచ్చేవరకు పోరుబాట చేస్తామని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు దివాకర్ రావు తెలిపారు.

సంబంధిత పోస్ట్