AP: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) కార్యాలయం తాజా గణాంకాలను వెల్లడించింది. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించేందుకు, జాబితాను పకడ్బందీగా తీర్చిదిద్దేందుకు ఎన్నికల సంఘం చర్యలు ముమ్మరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జారీ చేసిన 44.28 లక్షల నోటీసులకు గాను 44.25 లక్షల మందికి సంబంధించిన విచారణ పూర్తయింది. మిగిలిన కేసులపై త్వరలోనే తుది విచారణ జరుగుతుంది.