AP: ఉద్యోగాలు, అడ్మిషన్లలకు స్కిల్ టెస్ట్ తప్పనిసరి

5చూసినవారు
AP: ఉద్యోగాలు, అడ్మిషన్లలకు స్కిల్ టెస్ట్ తప్పనిసరి
AP: రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో అడ్మిషన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో పాటు, అభ్యర్థి వాస్తవ ప్రతిభను నిర్ధారించేందుకు స్కిల్ టెస్ట్ (నైపుణ్య పరీక్ష) తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఈ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించడానికి స్పోర్ట్స్ టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్, ఫిజికల్ డైరెక్టర్లు, శాప్ అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీ ఉంటుంది. ఈ కొత్త విధానంతో నకిలీ సర్టిఫికెట్లతో అడ్మిషన్లు, ఉద్యోగాలు పొందే అవకాశం ఉండదని, నైపుణ్యం ఉన్న క్రీడాకారులకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్