ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2026) ఫైనల్ కీ,
ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. మూల్యాంకనం, సాంకేతిక పరిశీలనలు పూర్తవ్వడంతో విద్యాశాఖ ఫలితాలను అందుబాటులోకి తెచ్చింది. రాబోయే డిఎస్సీ (DSC) నియామకాలలో టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉన్నందున అభ్యర్థులకు ఈ
ఫలితాలు ఎంతో ముఖ్యం. పరీక్ష రాసిన వారు అధికారిక వెబ్సైట్ tet2dsc.apcfss.in లో హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి తమ మార్కుల షీట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.