913 ఆశా పోస్టుల భర్తీకి ఆమోదం

4చూసినవారు
913 ఆశా పోస్టుల భర్తీకి ఆమోదం
AP: రాష్ట్రంలో ఇప్పటివరకు 1,294 ఆశావర్కర్ల పోస్టులను భర్తీ చేశామని, తాజాగా మరో 913 ఖాళీలకు ఆమోదం తెలిపినట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించే 'డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ' ద్వారా ఈ నెల 30వ తేదీలోగా నియామక ప్రక్రియను పూర్తి చేయనున్నారు. సంబంధిత గ్రామం లేదా వార్డుకు చెందిన, 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి, 25-45 ఏళ్ల వయసున్న మహిళలకు ప్రాధాన్యం ఇస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.10,000 గౌరవ వేతనం లభిస్తుంది.

సంబంధిత పోస్ట్