13 కార్పొరేషన్లలోనే సుమారు 60 లక్షల మంది ఓటర్లు

0చూసినవారు
13 కార్పొరేషన్లలోనే సుమారు 60 లక్షల మంది ఓటర్లు
AP: విశాఖపట్నం,  విజయవాడతో సహా మొత్తం 13 నగరపాలక సంస్థలకు నేడు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 922 డివిజన్లలో 118 డివిజన్లు ఏకగ్రీవం కాగా, మిగిలిన 804 డివిజన్లలో నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలలో 13 మేయర్ స్థానాల కోసం 153 మంది అభ్యర్థులు, మరియు కౌన్సిలర్ స్థానాల కోసం 3073 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సుమారు 60 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి 6384 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు జరిగాయి.

సంబంధిత పోస్ట్