APPSC ఉద్యోగుల వయో పరిమితి పెంపు

8చూసినవారు
APPSC ఉద్యోగుల వయో పరిమితి పెంపు
AP: APPSC, ఇతర ప్రభుత్వ రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా చేపట్టే ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రభుత్వం వయోపరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. నాన్-యూనిఫాం పోస్టులకు జనరల్ కేటగిరీలో వయోపరిమితిని 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచారు. పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్ వంటి యూనిఫాం పోస్టులకు కూడా నిర్దేశిత వయోపరిమితికి అదనంగా మరో రెండేళ్ల సడలింపు కల్పించారు. ఈ సడలింపు 2027 సెప్టెంబర్ వరకు వర్తించనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్