ఏపీ వైపు అక్వాన్ తుఫాన్ దూసుకొస్తోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 3 కి.మీ. వేగంతో ముందుకు కదిలింది. కాసేపట్లో ఇది తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉంది. చెన్నైకి 590 కి.మీ, మచిలీపట్నానికి 620 కి.మీ, విశాఖపట్నానికి 620 కి.మీ. దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ-వాయవ్య దిశలో ప్రయాణిస్తూ గురువారం సాయంత్రానికి అతి తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. గురు, శుక్రవారాల్లో కోస్తా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలకు అవకాశం ఉందని వివరించింది.