
జాంబియాలో తెలంగాణ వ్యక్తి మృతి
ఉపాధి కోసం ఆఫ్రికా ఖండంలోని జాంబియాకు వెళ్లిన తెలంగాణలోని నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన జనపాల లింగస్వామి (50) బోర్ డ్రిల్లింగ్ పనులు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందాడు. కొన్నేళ్లుగా జాంబియాలో బోరింగ్ రిగ్ వర్కర్గా పనిచేస్తున్న లింగస్వామి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. లింగస్వామికి ఇద్దరు కుమారులు కాగా, వారిలో ఒకరు గతేడాది మృతిచెందినట్లు గ్రామస్థులు తెలిపారు.




